చార్మినార్, సెప్టెంబర్ 7 : మతిస్థిమితం లేని ఓ వ్యక్తి నాలాలోకి దూకిన ఘటన డబీర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్స్టేషన్ పరిధిలోని 7 గుళ్ల ప్రాంతంలోని నాలాలోకి మతిస్థిమితంలేని ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం దూకాడు. విషయం తెలుసుకున్న డబీర్పుర పోలీసులు మహ్మద్ సాబేర్అలీ, షేక్ మొహద్ తన టీం సభ్యులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలాలోకి దూకిన వ్యక్తిని కాపాడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.