Hyderabad Metro | నిరుపయోగంగా మెట్రో భూములు.. ల్యాండ్ బ్యాంకును సద్వినియోగం చేసుకోని ఎల్అండ్టీ
ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలుకు ఖ్యాతి ఉన్నది. ఇంతంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 290 ఎకరాలను నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్‌కు కేటాయించింది. హెచ్ఎంఆర్ నినాదం రవాణా ఆధారిత అభివృద్ధి, అయితే ఇప్పటికీ సంస్థ వద్ద 50 ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంక్ ఉన్నది.
- ఆరేండ్లుగా ఖాళీగానే ల్యాండ్ బ్యాంక్
- మియాపూర్, ఉప్పల్ మెట్రో డిపోల పక్కన 50కి పైగా ఎకరాలు
- వ్యాపార,వాణిజ్య కార్యకలాపాలకు అవకాశం సద్వినియోగం చేసుకోని ‘ఎల్అండ్టీ’
Hyderabad Metro | ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలుకు ఖ్యాతి ఉన్నది. ఇంతంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 290 ఎకరాలను నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్‌కు కేటాయించింది. హెచ్ఎంఆర్ నినాదం రవాణా ఆధారిత అభివృద్ధి, అయితే ఇప్పటికీ సంస్థ వద్ద 50 ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంక్ ఉన్నది. అందులో వ్యాపార, వాణిజ్య భవనాల నిర్మాణాలు చేపట్టి.. అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉన్నా.. ఆ దిశగా ‘హైదరాబాద్ మెట్రో’ అడుగులు వేయడంలేదు.
– సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)
రవాణా ఆధారిత అభివృద్ధి
మియాపూర్ ప్రధాన రహదారిలో 99 ఎకరాలు, ఉప్పల్ భగాయత్‌లో 98 ఎకరాలతో పాటు రాయదుర్గం, అమీర్‌పేట, ఎర్రమంజిల్, హైటెక్ సిటీ, మూసారంబాగ్, పంజాగుట్ట ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వెంబడి ఎంతో విలువైన భూములను కేటాయించారు. ఆ స్థలాల్లో రెండు చోట్ల మియాపూర్, ఉప్పల్‌లో మెట్రో డిపోలను నిర్మించగా, సుమారు 50 ఎకరాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మిగతా 6 ప్రాంతాల్లోని భూముల్లో 5 చోట్ల మెట్రో మాల్స్‌ను నిర్మించగా, రాయదుర్గంలో కేటాయించిన 15 ఎకరాల్లో మాత్రం కొంతమేర ఆఫీస్ స్పేస్ భవనాన్ని నిర్మించి, మిగతా స్థలాన్ని ఖాళీగా ఉంచారు.
ప్రధానంగా మెట్రో డిపోల దగ్గర మిగులు భూముల్లో రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంట్ డెవలప్మెంట్) జరిగేలా వ్యాపార, వాణిజ్య భవనాల నిర్మాణాలను చేపట్టి వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా అలాంటి నిర్మాణాలు మెట్రో ప్రయాణికుల ఎన్నో అవసరాలు కూడా తీరుస్తాయి. కానీ ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ మాత్రం ల్యాండ్ బ్యాంక్‌ను సద్వినియోగం చేసుకోవడం లేదు. రవాణా ఆధారిత అభివృద్ధి అనే నినాదం నిజం కావాలంటే.. ఎల్ అండ్ టీ కి కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వానికి, అటు నిర్మాణ సంస్థకు ఆదాయం సమకూరుతుంది.
నగరవాసుల అవసరాలు తీర్చేలా..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇంటర్ మోడల్ కనెక్టివిటీతో కూడుకున్నది. ప్రజా రవాణా వ్యవస్థలో ఎంతో సౌకర్యవంతమైన మౌలిక వసతులను కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. అందుకోసం మూడు మెట్రో కారిడార్లు నిర్మించిన మార్గాల్లోనే ప్రభుత్వం భూములను ఎల్ అండ్ టీ మెట్రోకు కేటాయించింది. ఆ భూముల్లో నగర వాసుల అవసరాలు తీర్చేలా మాల్స్, వ్యాపార, వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తే అందరికీ ప్రయోజనంతో పాటు ప్రభుత్వానికి, మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఎల్ అండ్ టీకి నిరంతరం ఆదాయం వచ్చేది. కానీ ఇప్పటికీ పదుల సంఖ్యలో మెట్రోకు కేటాయించిన భూములు ఖాళీగా ఉన్నాయి. ఎల్ అండ్ టీ మెట్రో వద్ద ల్యాండ్ బ్యాంక్ సుమారు 50-60 ఎకరాల వరకు ఉన్నా, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది.
దశలవారీగా..
2012లో మొదలైన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం పనులు దశల వారీగా 2017 నుంచి పూర్తవుతూ.. 2020 వరకు మొత్తం 69 కి.మీ మేర 3 మెట్రో మార్గాల్లో అందుబాటులోకి వచ్చింది. 2017 నుంచే మెట్రో రైలు సేవలు నగర వాసులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు ఆరేండ్లు గడుస్తున్నా ..రవాణా ఆధారిత అభివృద్ధి అనే లక్ష్యానికి దూరంగా మెట్రో రైలు నిలుస్తోంది. కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆదాయం రావడం లేదని పట్టణ రవాణా నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

