Hyderabad | హబ్సిగూడలో దట్టంగా వ్యాపిస్తున్న పొగలు.. భయాందోళనలో స్థానికులు
Hyderabad | హబ్సిగూడలోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ ఇంకా దట్టంగా పొగలు వస్తుండటంతో భయాందోళనలకు గురవుతున్నారు. హబ్సిగూడలోని రెండో అంతస్తులోని ఓ హోటల్లో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి.
Hyderabad | హబ్సిగూడలోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ ఇంకా దట్టంగా పొగలు వస్తుండటంతో భయాందోళనలకు గురవుతున్నారు.
హబ్సిగూడలోని రెండో అంతస్తులోని ఓ హోటల్లో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్త మొదటి అంతస్తులోని అన్లిమిటెడ్ షోరూంలోకి కూడా వ్యాపించాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్ని ప్రమాదం జరిగిన భవనం పక్కనే పెట్రోలు బంక్ ఉండటంతో ముందు జాగ్రత్తగా పోలీసులు దాన్ని మూసేయించారు. అయితే మంటలు ఆర్పినప్పటికీ.. ఆ భవనంలో నుంచి దట్టంగా పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో ఉప్పల్ – సికింద్రాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిప్రమాదం జరిగిన దుకాణాల నుంచి జీహెచ్ఎంసీ అద్దాలు తొలగిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

