జల సంక్షోభం.. నగరంలో నీటి కొరత
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, వర్షాభావ పరిస్థితులు గ్రేటర్‌ను కుదిపేస్తున్నాయి. అక్టోబర్ నెలలోనే ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండటానికి తోడు భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో ఇండ్లలోని బోర్లన్నీ ఎండిపోతున్నాయి.
- 735 ఎంజీడీల డిమాండ్.. సరఫరా 584 ఎంజీడీలే
- అడుగంటిన భూగర్భజలాలు, వట్టిపోయిన బోర్లు
- రానున్న రోజుల్లో మరింత పెరగనున్న డిమాండ్
- ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అధికారుల నిర్లక్ష్యం
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, వర్షాభావ పరిస్థితులు గ్రేటర్‌ను కుదిపేస్తున్నాయి. అక్టోబర్ నెలలోనే ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండటానికి తోడు భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో ఇండ్లలోని బోర్లన్నీ ఎండిపోతున్నాయి. మరోవైపు నగరానికి నీటి సరఫరా చేసే ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోనూ నీటి పరిమాణం వేగంగా తగ్గుముఖం పడుతున్నది. వాస్తవానికి నగరానికి 735 ఎంజీడీల నీటి సరఫరా అవసరం ఉండగా అన్ని ప్రాజెక్టుల నుంచి జలమండలి ద్వారా 585 ఎంజీడీల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో నీటి లభ్యత 151 ఎంజీడీలు తగ్గింది.
– సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ):
తగ్గుతున్న నీటి లభ్యత..
గతంలో సిటీలో 300 అడుగుల లోతు బోర్లు వేస్తే నీళ్లు పుష్కలంగా లభించేవి. ఇప్పుడు 800 నుంచి 1,000 అడుగుల లోతు తవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. వెస్ట్ సిటీ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇలా నీటి లభ్యత నగరమంతా తగ్గిపోతుండటంతో డిమాండ్ అమాంతం పెరుగుతున్నది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి కొరతను పూడ్చాల్సిన అధికారులు ఆ ది శగా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే వి మర్శలున్నాయి. అధికారులు చ ర్యలు తీసుకోకుంటే నగరానికి నీటి కొరత ప్రధాన సమస్యగా మారే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

