నెల రోజులకే మంచినీళ్లు
మహానగరానికి మంచినీటి సమస్య ముంచుకొస్తున్నది. ఎల్‌నినో, వర్షాభావం వల్ల ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. చలికాలం సమీస్తున్నా ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా పాతాళానికి చేరుకుంటున్నాయి. ప్రజల ఇండ్లలో బోర్లు ఎండిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సిటీకి తాగునీరు అందించే జలాశయాలైన సింగూరు, మంజీరాలో నీటి మట్టాలు ప్రమాదకరంగా పడిపోతున్నాయి. సింగూరులో కేవలం నెల రోజులకు మాత్రమే సరిపోయేలా నీటి నిల్వలున్నాయి.
- అడుగంటుతున్న సింగూరు జలాశయం
- మహానగరానికి పొంచి ఉన్న తాగునీటి ముప్పు
- ప్రజలను సిద్ధం చేసేందుకు జలమండలి ప్రయత్నాలు
సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : సింగూరు పూర్తిస్థాయి నీటి మట్టం 1717.932 అడుగులు. గతేడాది ఈ సమయానికి 1709.549 అడుగులు ఉండగా ప్రస్తుతం అది మరింత తగ్గి 1689.500 అడుగులకు చేరుకున్నది. గతేడాదితో పోలిస్తే ఈసారి జలమట్టం 20 అడుగుల దిగువన ఉన్నది. మరో 3 అడుగుల దిగువకు చేరుకుంటే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా నిలిచిపోతుంది. దీంతో సింగూరులో ఎమర్జెన్సీ పంపింగ్ అనివార్యమవుతుంది. పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే మరో వారం, పదిరోజుల్లో ఎమర్జెన్సీ పంపింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో నగరానికి నీటి కష్టాలు అతితొందరలోనే రాబోతుండటం ఆందోళన కలిగిస్తున్నది.

Tanker
నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు
సింగూరు, మంజీరాకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాల నుంచి నీటిని సేకరించినా సరిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఇప్పటి నుంచే నీటి పొదుపునకు నగర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జలమండలి సిద్ధమవుతున్నది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ సహకారంతో ప్రతి ఇంటికి తిరిగి నీటి ఎద్దడి ఏర్పడుతున్న నేపథ్యంలో పొదుపు మార్గాలను అనుసరించేలా నగర ప్రజలను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కరపత్రాలు, అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తున్నది.
ఈనేపథ్యంలో వీలైనంత త్వరలో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయనున్నట్లు సమాచారం. అవగాహన కార్యక్రమాలతో పాటు నీటి చోరీని అదుపు చేసేవిధంగా జలమండలి యంత్రాంగం పనిచేయాల్సిన అవసరం ఉంది. ట్యాంకర్ల అక్రమ రవాణా, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు పరిమితికి మించి సరఫరా నిలిపేసేందుకు ప్రయత్నించాలి. నీటి అక్రమ సరఫరాను అరికడితే వినియోగదారులకు అందాల్సిన నీటిలో కొంతైనా సన్మార్గంలోకి వస్తుందని నగర ప్రజలు సూచిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి మేనేజర్ స్థాయిదాకా క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి దుర్వినియోగాన్ని అరికట్టాలని కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

