ఉగాదికి ఇరవై రోజుల ముందే ఉద్యోగనామ సంవత్సరం మొదలైంది. మాటతప్పని.. మడమ తిప్పని నేత సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కొలువుల జాతరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చెప్పినట్లుగానే సరిగ్గా పది గంటలకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. టీవీల ముందు కూర్చున్న నిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్లమీదకొచ్చి చిందేశారు. పటాకులు పేల్చి.. స్వీట్లు పంచిపెట్టి.. థాంక్యూ కేసీఆర్ అంటూ.. నినాదాలు చేస్తూ.. సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ యువతరం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన తెలంగాణ స్వరాష్ట్రంలో సకలం సుభిక్షంగా మారుతున్నదని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది..
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. గతంలోనే లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, తాజాగా బుధవారం శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించి నిరుద్యోగుల కుటుంబాల్లో సంబురాన్ని నింపారు. ఉద్యోగాల నియామకం పారదర్శకంగా జరుగుతుంది. యువత ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ప్రతిపక్షాలది చిల్లర రాజకీయం. వారి మాటలను నమ్మవద్దు.
– మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే
రాష్ట్ర ఏర్పాటు కల సాకారం..!
మాటతప్పని మహానేత సీఎం కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో ప్రజలకు జనరంజక పాలనను అందిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర కలను ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారు. ఇప్పటికే లక్షపైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఒకేసారి 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట తప్పనని మరోమారు నిరూపించుకున్నారు. నిరుద్యోగుల తరఫున సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కేపీ.వివేకానంద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
యువతకు ఎంతో మేలు
89,039 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 11,039 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణ చేయడం, భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల తెలంగాణ యువతకు ఎంతో మేలు జరుగుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఇప్పుడు మరో 92 వేల ఉద్యోగాలు భర్తీ అవుతుండటం సంతోషంగా ఉంది. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ యువత, విద్యార్థుల తరుఫున హృదయ పూర్వక ధన్యవాదాలు.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మల్కాజిగిరి పార్లమెంట్
మార్చి 9 పండుగ రోజు..!
ఉద్యోగాల నియామకాలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల కుటు ంబాల్లో ఆనందాన్ని నింపింది. కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సాధించాలనే ఆసక్తితో ఉన్న నిరుద్యోగులకు మార్చి 9 పండుగ రోజు. జోనల్ వ్యవస్థను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడినా.. సీఎం కేసీఆర్ పట్టుదలతో ఈ రోజు ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయడంతో వారి కుటుంబాల్లో ఆనందం నిండింది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే వర్తించడం చారిత్రక నిర్ణయం.
– దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే
దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా..
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ 91,142 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించి ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కండ్లలో ఆనం దం నింపారు. 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం గొప్ప విషయం. ఎనిమిదేండ్ల పాలనలో ఆకలి చావులు లేవు. మోడుబారిన బీడు భూములన్నీ పచ్చగా మారాయి. సీఎం కేసీఆర్ ముందుచూపు వల్ల దేశానికే అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఒకేసారి 90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయం. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి.
– మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
యువత బంధు.. సీఎం కేసీఆర్
ఒకేసారి 91,142 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ యువత బంధుగా మారారు. రైతులకు రైతు బంధుగా, మహిళలకు మహిళా బంధుగా, దళితులకు దళిత బంధుగా మారిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగ బాంధవుడిగా నిలిచాడు. ఉద్యోగ క్యాలెండర్‌తో ప్రభుత్వ శాఖల్లో ప్రతి సంవత్సరం ఖాళీలను భర్తీ చేసే అవకాశం కల్పించడం సైతం సీఎం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనం.
ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు
రాష్ట్రంలో సుమారు 80వేలకు పైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇప్పటికే పనిచేస్తున్న 11వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఇది ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు. కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఖాళీలను భర్తీచేయకుండా కాలయాపన చేస్తున్నా.. పట్టించుకోని బీజేపీ నాయకులు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ రాజకీయాలు చేస్తున్నారు. దమ్ముంటే కేంద్రప్రభుత్వ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేసేలా పోరాడండి.