సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : యూనివర్సిటీల బలోపేతంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. ఉన్నత విద్యకు పెద్ద పీట వేసి, దేశానికే ఆదర్శంగా నిలువాలన్న ఆకాంక్షతో యూనివర్సిటీలలో అన్ని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కలిపి మొత్తం 4,794 భర్తీ చేయడానికి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఆయా యూనివర్సిటీలకు చెందిన వీసీలు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ఓయూ, జేఎన్టీయూ, తెలుగు వర్సిటీ, ఓపెన్ వర్సిటీ, జేఎన్యూఎఫ్ఏల పరిధిలో టీచింగ్ పోస్టులు 1367, నాన్ టీచింగ్‌పోస్టులు 2457 ఖాళీలు ఉన్నాయి. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై వర్సిటీలకు చెందిన అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..