సుల్తాన్‌బజార్, మార్చి 11 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆయురారోగ్యాలతో ఉం డాలని గోత్ర నామాలతో రుద్ర అధ్యాయంతో రుద్రాభిషేకం, రుద్ర హోమం నిర్వహించామని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. శుక్రవారం కోఠిలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చక, అర్చక సమాఖ్య ప్రతినిధులతో కలిసి ఆయన రుద్రాభిషేకం, పంచసోక్తములతో పరమేశ్వరుని అనుగ్రహం సీఎం కేసీఆర్‌పై ఉండాలని గోత్ర నామాలతో ప్రత్యేక పూజలను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్చకులకు గౌ రవ భృతి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణఅని అ న్నారు. హిందూ సమాజానికి మూల స్తంభాలైన ఆలయవ్యవస్థను గత పాలకులు విస్మరించినా తెలంగాణ ఏర్పడిన అనంతరం అభివృద్ధికి కృషిచేస్తూ కోట్లాది మంది హృదయాలలో నిలిచిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఏటూరి ఆంజనేయ చారి, రాజేశ్వర శర్మ, జక్కాపురం నర్సింహా స్వామి పాల్గొన్నారు.
యూసుఫేయిన్ బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు..
అబిడ్స్,మార్చి 11 :ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు మాజీ సభ్యులు వహీద్ అ హ్మద్, టీఎస్ఎంఎఫ్సీ మాజీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ నాంపల్లిలోని యూసుఫేయిన్ బాబా దర్గాలో చాదర్‌ను సమర్పించి ప్రార్థనలు చేశారు. కార్యక్రమం లో మైనార్టీ నాయకులు సయ్యద్ ఫహీ మ్, మ హ్మద్ అలీం ఖాన్, మహమ్మద్ ఓబేద్ ఖాన్, మహ్మద్ సలీం ఖాన్, మహ్మద్ మసిఉద్దీన్, మహ్మద్ ఏజాజ్, మహ్మద్ అబ్దుల్ రహీం, మహ్మద్ అఫ్రోజ్ పాల్గొన్నారు.
లంగర్‌హౌస్ దర్గాలో ప్రార్థనలు
మెహిదీపట్నం, మార్చి 11 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యం కోసం నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహ్మద్ యూసుఫ్, ఇక్బాల్, సర్వర్ లంగర్‌హౌస్ దర్గాలో శుక్రవారం సాయంత్రం ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రదాత అయిన సీఎం కేసీఆర్ మెరుగైన ఆరోగ్యంతో సేవలు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు.