ఎమ్మెల్యే వివేకానంద్
రూ.9.44కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన…ప్రారంభోత్సవాలు
దుండిగల్, మార్చి 6 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు పూర్తి అయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు. అందులో భాగంగానే నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో రూ.9కోట్ల 44 లక్షల నిధులతో పలు నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాప న, ప్రారంభోత్సవాలు చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ మేయర్ ధన్రాజు, కార్పొరేటర్లు మేకల వెంకటేశం, ఆగంపాండు, కొలన్ వీరేందర్‌రెడ్డి, బాలాజీనాయక్, ఏనుగుల శ్రీనివాస్‌రెడ్డి, కొలన్ మీనా సునీల్‌రెడ్డి, రాజేశ్వరీ, సుజాత, సురేశ్‌రెడ్డి రాఘవేంద్రరావు, కో-ఆప్షన్ సభ్యులు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొలన్ గోపాల్‌రెడ్డి, నిజాంపేట కార్పొరేషన్ టీఆర్ఎస్ కమిటీ ప్రెసిడెంట్ వాకలపూడి రంగరాయప్రసాద్తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.
డివిజన్.. వెర్టెక్స్ వద్ద రూ.1కోటి 96 లక్షలతో ఆర్సీసీ పైప్‌లైన్, బాలాజీ హోమ్స్ నుంచి అంభీర్ చెరువు వరకు ఓపెన్‌నాలా నిర్మాణ పనులు ప్రారంభం
డివిజన్ .. రూ.90లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
డివిజన్.. సప్తపది గార్డెన్స్ వద్ద రూ.95 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం, ఆర్సీసీ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన
డివిజన్ .. రూ.15లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం
డివిజన్ ..45లక్షలతో డీఐ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన
డివిజన్.. శ్రీ హోమ్స్ కాలనీలో రూ.1కోటి 16లక్షలతో చేపట్టనున్న ఆర్సీసీ 900 ఎంఎం పైప్‌లైన్, భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
డివిజన్ .. ఇందిరానగర్ కాలనీలో రూ.85.48లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ ప్రారంభం
డివిజన్.. నిజాంపేట రాజధాని పాఠశాల నుంచి పాపయ్యకుంట వరకు రూ.1కోటి 77లక్షల 20వేల నిధులతో నిర్మించిన ఓపెన్‌నాలా ప్రారంభం… అదే విధంగా రూ.1కోటి 12లక్షల వ్యయంతో మధురానగర్‌లో భూగర్భడ్రైనేజీతో పాటు నల్లపోచమ్మ గుడి నుంచి పాపయ్యకుంట వరకు నిర్మించిన భూగర్భ డ్రైనేజీ ప్రారంభం.
డివిజన్ .. రామభద్ర ఎన్‌క్లేవ్‌లో భూగర్భడ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.