బడంగ్‌పేట/కందుకూరు/మహేశ్వరం/పహాడీషరీఫ్/ఆర్కేపురం, ఫిబ్రవరి 27: పోలియో రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్‌పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. బడంగ్‌పేట, మీర్‌పేట పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు. మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి కుమార్తెకు మంత్రి చేతుల మీదగా పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో 38లక్షల పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 23 వేల పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, మీర్‌పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, డీఈఈ అశోక్‌రెడ్డి, డాక్టర్ రవికుమార్, వినోద్‌కుమార్, డీఐవో డాక్టర్ స్వర్ణకుమారి, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ శారద, డాక్టర్ స్వరూప, కార్పొరేటర్లు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
నిండు జీవితానికి రెండు చుక్కలు
కందుకూరు ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు ప్రారంభించి, ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సురుసాని సురేందర్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ రాధిక, రవీందర్, డైరెక్టర్ ఆనంద్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా మండల పరిధిలోని కొత్తగూడ గ్రామ పంచాయతీలో జిల్లా పంచాయతీరాజ్ కన్వీనర్ సాద మల్లారెడ్డి పోలియో చుక్కలను వేశారు. మండల పరిధిలోని 35 గ్రామ పంచాయతీలు అను బంధ గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు పోలియో చుక్కలను ప్రారంభించారు.
మహేశ్వరంలో..
మహేశ్వరం మండల కేంద్రంలో ఎంపీపీ రఘుమారెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేశ్ చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్ ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్, డాక్టర్ సంధ్యారాణి, పంచాయతీ కార్యదర్శి వజ్రలింగం, తదితరులు పాల్గొన్నారు.
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో..
బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆధ్వర్యంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జల్పల్లి, శ్రీరామకాలనీ, పహాడీషరీఫ్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు చిన్నారులకు పోలియో చుక్కల మందును వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, భాషమ్మ, ప్రశాంతి శ్రీధర్‌గౌడ్, షేక్ పహిమిదా అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం డివిజన్లో..
సరూర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భగత్‌సింగ్‌నగర్ బస్తీ, అంబేద్కర్‌నగర్ బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలను సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో సరూర్‌నగర్ మెడికల్ అధికారిణి డా.అర్చన, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్కేపురం డివిజన్ చిత్రలేఅవుట్ కాలనీలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.