సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో ప్రతిష్టాత్మకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు బుధవారం కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 36 నెలల్లో స్టేషన్ అప్‌గ్రేడేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలను ప్రయాణికులకు అందించడానికి మాస్టర్ ప్లాను రూపొందించారు. అందుకోసం చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయి.