మాదాపూర్, సెప్టెంబర్ 27: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతున్నది. ఫ్రీడం హెల్దీకుకింగ్ ఆయిల్, కేఎల్ఎం షాపింగ్ మాల్, టైటిల్ స్పాన్సర్లుగా, బిగ్ సీ, సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రధానస్పాన్సర్లుగా పవర్డ్ బై నిలోఫర్ కేఫ్ సహకారంతో ఆరు రోజులుగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే దసరా బొనాంజా దిగ్విజయంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మాదాపూర్లోని బిగ్సీలో నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ జనరల్ మేనేజర్ సురేందర్ రావు, ఏజీఎంలు రాములు, రాజిరెడ్డి, బిగ్ సీ ఏపీ, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ యూసుఫ్లతో కలిసి పలువురు వినియోగదారుల సమక్షంలో లక్కీ డ్రా తీశారు. ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లికి గ్రామానికి చెందిన శ్రీ నిధి, రెండవ బహుమతి సంధ్యా, మూడవ బహుమతి అవినాష్, నాలుగోవ బహుమతి పడిగమ్మల వికాస్, ఐదో బహుమతి మంజు కన్నలు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రతినిధులతో పాటు బిగ్ సీ ఉద్యోగులు పాల్గొన్నారు.
బొనాంజాను వినియోగించుకోండి..
తెలంగాణలో దసరా పండుగకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. ఈ పండుగను పురస్కరించుకొని పలు షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సంస్థలు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం చూస్తుంటాం. వీటన్నింటికీ అదనంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో వినియోగదారులకు బిగ్సీ ప్రత్యేక స్కీంలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 30 వరకు బొనాంజాలో భాగంగా షాపింగ్ చేస్తే కళ్లు చెదిరే బహుమతులు గెలుచుకోవచ్చు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.
– సురేందర్ రావు, నమస్తే ఏడీవీటీ జనరల్ మేనేజర్
విజేతలకు శుభాకాంక్షలు..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో దసరా బొనాంజాను పురస్కరించుకొని తీసిన లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి శుభాకాంక్షలు. దసరా, దీపావళిని దృష్టిలో పెట్టుకొని బిగ్ సీ ఫోన్లు, టీవీలు, సౌండ్బార్స్పై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. బిగ్ సీ ఇస్తున్న ఈ డిస్కౌంట్లను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
– యూసుఫ్, బిగ్ సీ ఏపీ,తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్
అదృష్టం వరించింది..
మాదాపూర్లోని బిగ్ సీలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చి షాపింగ్ చేశాం. బొనాంజాలో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో లక్కీ డ్రా తీస్తుండగం గమనించా. మా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాం. నేను ఊహించినట్లే బహుమతి రావడం ఆనందంగా ఉంది. షాపింగ్ కోసం ఖర్చు చేసిన నగదు బహుమతుల రూపంలో తిరిగి రావడం మరిచిపోలేని విషయం. దసరా, దీపావళి ప్రతిఒక్కరిలో సంతోషాలు నింపాలని కోరుకుంటున్నా.
– మౌనిక ఉదయ్, సికింద్రాబాద్
విజేతగా నిలుస్తాననుకోలేదు..
గతంలో అనేక సార్లు షాపింగ్ చేసినప్పుడు కూపన్లు రాసి వేసినా ఎప్పుడూ అదృష్టం వరించలే. చింతల్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఈ నెల 26న రూ. 10 వేల షాపింగ్ చేశాం. మా స్వగ్రామం మెదక్ జిల్లాలోని జక్కపల్లి. పండుగ బట్టల కోసం కుటుంబ సమేతంగా సీఎంఆర్కు వచ్చాం. కొనుగోలు చేశాక సీఎంఆర్ సిబ్బంది కూపన్లు ఇచ్చారు. చివరకు నమస్తే తెలంగాణ వారు ఫోన్ చేసి మొదటి బహుమతి గెలుచుకున్నట్లు చెప్పడంతో ఎంతో సంతోషం వేసింది.
–శ్రీ నిధి, జక్కపల్లి