నమస్తే తెలంగాణ,నెట్వర్క్ : రవిగాంచని చోట కవి గాంచున్.. అంటారు. కవులకు అంతటి ప్రతిభా సామర్థ్యాలు ఉంటాయి. కవి కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం ఎందరినో ప్రభావితం చేస్తుంది. ఇటీవల జాతీయ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కవులు, రచయితలు ప్రస్తుత మతతత్వ పాలనపై మండిపడుతున్నారు. దేశం సుస్థిర అభివృద్ధి సాధించాలంటే విజన్ ఉన్న నాయకుడు రావాలని కోరుకుంటున్నారు. సమర్థత, పాలనా దక్షత ఉన్న కేసీఆరే జాతీయ రాజకీయాల్లో రాణించగలుగుతారని బలంగా విశ్వసిస్తున్నారు. ఈ మేరకు ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలని ముక్తకంఠంతోగళమెత్తుతున్నారు.
కేసీఆర్‌కు స్పష్టమైన ప్రణాళిక ఉంది
దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు సమైక్యతను కోరుకుంటున్నారు. దేశ రాజకీయాలను గాడిలో పెట్టడానికి సీఎం కేసీఆర్ కేంద్ర రాజకీయాలలోకి రావాలి. సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన ప్రణాళికతోపాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు పరచాలన్న తపన ఉంది. ఇప్పటికే దేశంలోని రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు దేశంలోని ప్రజలకు అందాలి.
– కామేశ్వరి, రచయిత్రి, మల్కాజిగిరి
తెలుగు భాషకు శుభసూచకమే…
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెలుగు భాషా వికాసం, భాషా ఔన్నత్వాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించి భాషకు పట్టం కట్టారు. రచయితలు, కవులకు, కళాకారులకు ఆయా పదవులు ఇవ్వడం, మరికొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించి వారికి సముచిత గౌరవమందించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే జాతీయ స్థాయిలో తెలుగు భాషాభివృద్ధికి ఎంతో మేలు చేకూరుతుంది.
– మోటూరి నారాయణరావు ,కవి, రచయిత
కేసీఆర్ రావడం మంచి పరిణామం
జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం మంచి పరిణామం. దీనిని కవులు, రచయితలు అందరూ స్వాగతిస్తున్నారు. బీజేపీ పాలనలో ప్రశ్నించే గొంతులపై పగ పట్టారు. మతోన్మాద పార్టీకి జవాబు చెప్పడానికి కేసీఆర్ అందరినీ కలుపుకోవాలి. దేశ సమైక్యతకు సీఎం కేసీఆర్ అవసరం.
– భూపతి వెంకటేశ్వర్లు,కవి, రచయిత
రైతులకు మేలు జరుగుతుంది
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం తప్పా ప్రజలకు చేసేందేమీ లేదు. కాంగ్రెస్ నాయకత్వలోపంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. రైతుబంధువుగా పేరొందిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని రైతులకు మేలు జరుగుతుంది.
– సంజీవరావు, మేడ్చల్
దూరదృష్టి ఉన్న నాయకుడు
సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినట్లు దేశాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తారు. దశాబ్దాలుగా ఉత్తరాది పార్టీలకు చెందిన నాయకులు ఢిల్లీ పీఠంపై కూర్చొని మన రాష్ర్టాన్ని చిన్నచూపు చూస్తున్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌లాంటి విజన్ ఉన్న నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుంది.
– యలమర్తి అనురాధ,రచయిత్రి
పేదల దశ మారుతుంది
దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఇక్కడి పథకాలు, అభివృద్ధి దేశమంతా విస్తరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పేదల దశ మారాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది.
– సిలివేరు హరినాథ్
మంచి విజన్‌తో రావాలి
సీఎం కేసీఆర్ మంచి విజన్‌తో దేశ రాజకీయాల్లోకి రావాలి. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరైనా, ఏ పదవైనా పొందొచ్చు. కేసీఆర్ అందరినీ ప్రభావితం చేసే అంశాన్ని తీసుకొని జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. దార్శనికత, విషయ పరిజ్ఞానం ఉన్న నేత. వనరులను వినియోగించగల సమర్థత ఆయనకు ఉంది. ఉద్యమ నేతగా తెలంగాణను సాధించినట్లుగానే భారత్‌ను అభివృద్ధి బాటలో నడిపించాలి.
– రామకృష్ణ చంద్రమౌళి,కవి,నల్లకుంట
దేశగతిని మారుస్తాడు
ఉద్యమ నేతగా కేసీఆర్ తెలంగాణ సాధించారు. సీఎంగా రాష్ర్టానికి జనరంజక పాలన అందిస్తున్నారు. పక్కా విజన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇదే ఒరవడితో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. దేశంలో స్థితిగతులను మార్చాలి. అంతటి సమర్థత ఆయనకు ఉంది. నిరుపేదల బాధలు, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వెళితే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు చమరగీతం పాడాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యం.
-రవూఫ్, రచయిత
దేశ ప్రజలు స్వాగతించాలి
దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను ప్రజలు స్వాగతించాలి. ఎనిమిదేండ్ల కాలంలో రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చిన కేసీఆర్ దేశాన్ని మారుస్తానడంలో ఆశ్చర్యంలేదు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం జాతీయ పార్టీ ఏర్పాటు ఎంతో అవసరం. 2024లో బీజేపీయేతర పార్టీ అధికారంలోకి రావడానికి కేసీఆర్‌దే కీలకపాత్ర.
– కాలువ మల్లయ్య, రచయిత
సమర్థత గల నాయకుడు
ప్రజాస్వామ్యంలో వేరు వేరు పార్టీలు ఉండవలసిన అవసరం ఉంది. ఇతర పార్టీలు లేకపోతే నియంతృత్వం అవుతుంది. దేశ సౌభాగ్యం కోసం పాటుపడేవారు ఎవరైనా జాతీయ రాజకీయాలు చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆలోచన మంచిదే. సమర్థతల గలవాడు కాబట్టే రాష్ర్టాన్ని పరిపాలిస్తున్నాడు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది. దేశంలోని రైతుల సమస్యలను పరిష్కరించి పనిచేసే సామర్థ్యం కేసీఆర్‌కు ఉంది. అందరినీ కలుపుకుని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ప్రజలకు మేలు జరుగుతుంది.
– డాక్డర్ ముదిగంటి సుజాతారెడ్డి, ప్రఖ్యాత రచయిత్రి
విజన్ ఉన్న నాయకుడు
తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామమే. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కవులను, కళాకారులను ఎంతో గౌరవించారు. దేశ ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తపన ఆయనలో పుష్కలంగా ఉంది. ఇక్కడ అన్ని రంగాల్లో ఆయన విజయం సాధించారు. ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ సుధీర్ఘఅనుభవం దేశానికి ఎంతో అవసరం.
– రంగరాజు కరుణాకర్‌రావు,ప్రముఖ కవి
కేసీఆర్‌ను అందరూ బలపరచాలి
జాతీయ రాజకీయాలలో ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉంది. భారతదేశాన్ని గుణాత్మక మార్పు వైపు తీసుకుపోతాననే కేసీఆర్‌ను ఆహ్వానించాలి. తెలంగాణ సాధించిన కేసీఆర్ ఆలోచన దేశంపై ఉండడం మంచిదే. ఈ దశలో సీఎం కేసీఆర్‌ను అందరూ బలపరచాలి. ఏకమార్గంతో కూడిన పరిపాలన ఉండాలని పాలకులు అనుకోవడం మంచిది కాదు. ప్రజలే మార్పు కోరుతున్నారు.
– యాకూబ్, ప్రముఖ కవి
కేసీఆర్‌తోనే సుస్థిర అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్‌లాంటి తెగింపు ఉన్న నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. మోదీ పాలనలో పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దేశంలో సుస్థిర అభివృద్ధి సాధించాలంటే రాష్ట్రంలోని సంక్షేమ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అది జరగాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లొకి రావాలి.
– తులసి వెంకట రమణా చార్యులు, యువ కవి