అల్వాల్, సెప్టెంబర్ 5: ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు సృష్టించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆయన అల్వాల్‌లోని లయోలా అకాడమీలో సోమవారం జరిగిన రెండు రోజుల జాతీయ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రిజోబియమ్ బాక్టీరియా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం, మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ, ఏకాగ్రతతో తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. సేంద్రియ వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సూక్ష్మజీవుల ప్రాధాన్యాన్ని రైతులకు, రాబోవు తరాలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మిజోరాం యూనివర్సిటీ వైస్ చైర్మన్ ప్రొ.సాంబశివరావు, ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.అరవింద్ కుమార్, నామ్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, లయోలా అకాడమీ ప్రిన్సిపాల్ డా.జోజిరెడ్డి, ఇతర లెక్చరర్లు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.