సిటీబ్యూరో, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): విద్యుత్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల అభివృద్ధిని అడ్డుకునేలా ఇంధన శాఖ కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం, విద్యుత్ పంపిణీ సంస్థలో రోస్టర్ విధానం పాటించాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో ఉద్యోగ సంఘం నాయకులు ఆనంద్ బాబు, కృష్ణ, ఎం.రవీందర్, రామారావు, జె.నర్సింహా, మేకల నాగరాజు, శరబంధుతో పాటు పలు జిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు.