బోడుప్పల్, సెప్టెంబర్3 : సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం బోడుప్పల్ బొమ్మక్ శంకరయ్యగార్డెన్లో ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీకి ముఖ్య అతిథిగా హజరై మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్ పద్మజారాణి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లతో కలిసి 925 మంది లబ్ధిదారులకు పింఛన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అర్హులైన ప్రతి నిరుపేదకు పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఘట్కేసర్లో..
ఘట్కేసర్, సెప్టెంబర్3 : ఘట్కేసర్లో చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో శనివారం నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ వసంత, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ ఘట్కేసర్ మండల ఉపాధ్యక్షుడు పి.వెంకటేశ్వరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కె.అంజిరెడ్డి, నాయకులు బొక్క ప్రభాకర్‌రెడ్డి, ఎం.వెంకటేశ్ ముదిరాజ్, గోపాల్‌రెడ్డి, ఎం.జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బండ్లగూడలో ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీ
బండ్లగూడ, సెప్టెంబర్ 3 : కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రానున్న పార్లమెంట్ సమావేశంలో గట్టిగా బుద్ధి చెబుతామని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 462 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల కార్డులను స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్‌గౌడ్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు సాగర్‌గౌడ్, పద్మావతి పాపయ్యయాదవ్, అనితవెంకటేశ్, డీఈ యాదయ్య, ఏఈ రాజీవ్, టీఆర్ఎస్ నాయకులు సురేశ్‌గౌడ్, మల్లేశ్‌యాదవ్, సుమన్‌గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, రాంప్రసాద్, నాగరాజు, లక్ష్మి, సాయిబాబగౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.