చర్లపల్లి/ఉప్పల్, సెప్టెంబర్ 2: నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఆదర్శకాలనీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్ సంక్షమ సంఘం నాయకులు ఎమ్మెల్యేని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని, భవానీనగర్‌లో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు శ్రీరాములు, చిరంజీవి, రుక్కయ్య, గోవింద్, ఒబుల్‌రెడ్డి పాల్గొన్నారు.
పార్కుల అభివృద్ధికి చర్యలు..
నియోజకవర్గ పరిధిలోని పార్కు స్థలాలను పరిరక్షించి అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని మధురనగర్‌లోని పార్కు స్థలం కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధురనగర్‌లో పార్కు స్థలం కబ్జాలకు గురికాకుండా తగు చర్యలు తీసుకొవాలని ఆయన సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాస్, నర్సింహ్మరెడ్డి, లక్ష్మారెడ్డి, సాయిబాబాచార్యులు, వెంకటేశ్వరశర్మ, టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్‌ఫండ్ అందజేత
హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలోని కార్యాలయం లో శుక్రవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.4 లక్షల చెక్కును లబ్ధిదారులు రాజుకు, అదేవిధంగా రూ.24 వేల చెక్కును యాదగిరిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, చింతల నర్సింహారెడ్డి, మేకల ముత్యంరెడ్డి, వేముల మారయ్య తదితరులు పాల్గొన్నారు.
కాప్రా డివిజన్‌కు చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు బిక్షపతికి దళితబంధు పథకం కింద మొబైల్ టిఫిన్ సెంటర్ వాహనం మంజూరు కాగా ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి శుక్రవారం లబ్ధిదారుడికి ‘కీ’ని అందజేసి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు పథకంలో భాగంగా జీవనాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు మొబైల్ టిఫిన్ సెంటర్ వాహనంను ఎంపిక చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.