ఎర్రగడ్డ, సెప్టెంబర్ 2: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో మెరుగైన వసతులతో పాటు, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు దక్కేలా చూస్తానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్లో వినాయకరావునగర్, బాబా సైలానీనగర్, ఎన్ఆర్ఆర్ పురం సైట్-3 కాలనీలో రూ.25.5 లక్షలతో చేపట్టనున్న తాగునీటి పైప్‌లైన్ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడేండ్ల వ్యవధిలో అభివృద్ధిలో వెనుకబడ్డ పలు ప్రాంతాలకు కోట్లాది రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. అన్ని డివిజన్లలో అంతర్గత సీసీ రోడ్లు, తాగునీటి, సీవరేజీ పైప్లైన్లకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. పెరిగిన జనాభాకనుగుణంగా మౌలిక వసతులను విస్తరించాల్సిన అవసరం ఉన్నదని.. బోరబండతో పాటు ఇతర డివిజన్లలో చేపట్టాల్సిన పనులకు అంచనా వ్యయాన్ని పూర్తి చేశామన్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారుల విషయంలో నగరంలో జూబ్లీహిల్స్ ముందు వరుసలో ఉన్నదన్నారు. దళితబంధు పథకం ద్వారా నియోజకవర్గంలో ఇప్పటికే వందల కుటుంబాలకు ఉపాధి లభించిదని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కో ఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, లక్ష్మణ్‌గౌడ్, ఆనంద్, బాబూరావు, సరళ, దేవమణి, గౌస్, ఫయాజ్, తిరుపతయ్య, సునీల్‌కుమార్, రమేశ్, యూ సుఫ్, డేవిడ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.