దుండిగల్, సెప్టెంబర్2: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో పాటు మెరుగైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. తాను దత్తత తీసుకున్న షాపూర్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం అధికారులతో కలిసి ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు సందర్శించి స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. అదే విధంగా పాఠశాలలోని సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో నూతన తరగతి గదులను నిర్మించడంతో పాటు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని, షాపూర్‌నగర్ పాఠశాలను నియోజకవర్గానికే మోడల్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఆంజనేయులు, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, జగన్, మాజీ కార్పొరేటర్ సురేష్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ సోమేశ్యాదవ్, వివిధ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు.
*రాష్ట్ర కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డిని బోయిన్‌పల్లిలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉమ్మ డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్‌లోని కార్యాలయం ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. శంభీపూర్‌లోని ఆయన కార్యాలయంలో శుక్రవారం సుభాష్‌నగర్ డివిజన్ అపురూప కాలనీలో నెలకొన్న సమస్యలపై మాజీ కార్పొరేటర్ సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఎమ్మెల్సీకి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అపురూప కాలనీ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
నియోజకవర్గం పరిధిలోని పలుకాలనీలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాల నేతలు శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ, తమ ప్రాంతాలల్లో జరిగే వినాయకుడి పూజలల్లో పాల్గొనాలని ఆహ్వానపత్రాలను అందజేశారు.