కొండాపూర్, ఆగస్టు 28: హైటెక్ సిటీ ఐటీ కారిడార్‌లో పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన దుర్గం చెరువులో మరింత సందడి నెలకొననున్నది. హుస్సేన్‌సాగర్‌లో కొనసాగే సెయిలింగ్ పోటీలు ఇప్పుడు దుర్గం చెరువులోనూ ప్రారంభమయ్యాయి. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు యాక్ట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి దుర్గం చెరువులో సెయిలింగ్ క్రీడలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించారు. ప్రారంభం రోజే క్రీడాకారులు బోటింగ్‌లో సందడి చేయడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తిలకించారు.