జూబ్లీహిల్స్/మియాపూర్/కేపీహెచ్‌బీ కాలనీ/బడంగ్‌పేట, ఆగస్టు 28: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి నగరం నలుమూలల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రెండు మూడు రోజులుగా వందలాదిగా కాషాయ పార్టీ కార్యకర్తలు గులాబీ దళంలోకి వచ్చి చేరుతున్నారు. బీజేపీ రాజకీయాలపై విసుగు చెందిన నేతలు, కార్యకర్తలు ఆదివారం జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్పల్లి, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో భారీగా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
దేశంలో బీజేపీ వాళ్ళే దేశ భక్తులుగా భావించుకుంటున్నారని.. కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూ బ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ విమర్శించారు. ఆదివారం రహ్మత్‌నగర్ డివిజన్ హెచ్‌ఎఫ్‌నగర్-2లో టీఆర్ఎస్లో చేరిన 300 మంది బస్తీవాసులకు కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అందుకే అన్ని ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో వచ్చి చేరుతున్నారని చెప్పారు.
పేద ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలను ఆదుకునే విధంగా ఆయా పథకాలు రూపకల్పన చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రజలు స్వ చ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. హబీబ్ ఫాతిమా నగర్ నుంచి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి నాయకత్వంలో హెచ్ఎఫ్ నగర్ ఫేస్-2 ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ గని ఆధ్వర్యంలో మైనార్టీలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తన్నూఖాన్, అప్పూఖాన్, డివిజన్ అ ధ్యక్షుడు మన్సూర్, మహ్మద్ మొయిజ్, సయ్యద్ సికిందర్, ఎస్డి జాఫర్, ఎండీ షరీఫ్, ఎస్డి ఖాజా, మసీద్ సదర్, ఫజల్, ఎస్డీ ఫరూఖ్, సయ్యద్ రఫీ, ఎండీ జాఫ ర్, ప్రధాన కార్యదర్శులు సుబ్బరాజు, శ్రీనివాస్, నాగరాజు, గన్ని, జబ్బార్, చోటు, ఫయాజ్, గపూర్, అలీమ్‌లతో పాటు పార్టీలో చేరిన వారు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం: విప్ గాంధీ
పుట్టుక నుంచి చావు వరకు ప్రజలపై పన్నులను విధి స్తూ బిజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరిస్తున్నదని రాజకీ య లబ్ధి ఆరాటం కోసం పాకులాడుతున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సహా ప్రజా సంక్షేమం పాలనకు సమర్థుడైన సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ గోపన్‌పల్లికి చెందిన బీజేపీ నాయకులు సురేశ్ సహా 200 మంది పార్టీ కార్యకర్తలు మాజీ కార్పొరేటర్ సాయిబాబా, పార్టీ నేత మంత్రి ప్రగడ సత్యనారాయణల ఆ ధ్వర్యంలో విప్ గాంధీ సమక్షంలో టీఆర్ఎస్లో చేరా రు. మియాపూర్ క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజులరెడ్డి, రోజాదేవిలతో కలి సి విప్ పలువురు నేతలకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత లు రఘునాథ్‌రెడ్డి, మిర్యాల రాఘవరావు, అక్బర్‌ఖాన్, విష్ణు వర్ధన్‌రెడ్డి, నరేందర్, మల్లేశ్ పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్షితులై చేరికలు: ఎమ్మెల్యే మాధవరం
గత కొంత కాలంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఎమ్మె ల్యే కృష్ణారావు సమక్షంలో బాలాజీనగర్ డివిజన్‌కు చెందిన పవన్ యాదవ్, సంతోష్‌లతో పా టు 100 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ, ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించినదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు, తూము శ్రవణ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, అంబటి శ్రీనివాస్ తదితరులున్నారు.
టీఆర్ఎస్లో చేరిన బాలాపూర్ యువత
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముగింపు దశలో ఉన్న సందర్భంగా నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోనే సాధ్యమవుతుందని భావించి మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరినట్లు బాలాపూర్ గ్రామ యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి, పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, అత్తాపురం శ్రీనివాస్‌రెడ్డి, తమ్మినేని గిరీష్ కుమార్, మున్నా, హరిగౌడ్, వంగేటి అశ్విన్‌రెడ్డి పాల్గొన్నారు.