లోకాలు ఏలే వినాయకుడి వేడుకలకు సికింద్రాబాద్, కంటోన్మెంట్ల పరిధిలోని బస్తీలు, కాలనీలు సిద్ధమయ్యాయి. ఈ నెల 31న వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించేందుకు భక్తులు ఉత్సాహంగా ఉన్నారు. నగరంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు డీజీపీ మహేందర్‌రెడ్డి పంపిన నిబంధనలు అమలు చేయాలని నగర సీపీ సీవీ ఆనంద్ ఇప్పటికే సిబ్బందిని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్ డీసీపీ చందనాదీప్తి తన పరిధిలోని సీఐలు విగ్రహ నిర్వాహకులతో సమావేశమై నిబంధనలు వివరించారు.
నిబంధనలు..
పాఠశాలలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలి
విగ్రహం ఏర్పాటు చేయాలంటే పోలీసు అనుమతి తప్పనిసరి. శాఖ నిర్దేశించిన నిబంధనలు పాటించి సహకరించాలి. పాఠశాలలకు, ప్రార్థనామందిరాలకు దూరంగా మండపాలను ఏర్పాటు చేసు కోవాలి. సమీప కాలనీ, బస్తీవాసులకు ఇబ్బంది కలిగించేలా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయవద్దు. ఏ సమస్య తలెత్తినా పోలీసుల దృష్టికి తీసుకురావాలి.
– సీహెచ్. నేతాజీ, ఎస్హెచ్ఓ, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్