బంజారాహిల్స్,ఆగస్టు 28: జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్, గౌతమ్‌నగర్ బస్తీల్లో పాడైపోయిన రోడ్ల స్థానంలో రూ.19.9 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. మూడు రోజులుగా జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు శ్రమించి గౌతమ్‌నగర్‌లోని మూడు వీధుల్లో రోడ్డు పనులు పూర్తిచేయించారు. ఈ బస్తీల్లో గతంలోనే మురుగు సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశాలతో సీవరేజ్ లైన్ పనులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సీవరేజ్ లైన్ పనులు పూర్తయిన తర్వాత రోడ్ల పనులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే దానం ఆదేశించిన సంగతి తెలిసిందే. బస్తీలో పెండింగ్‌లో ఉన్న మరో మూడు రోడ్లను గణపతి నవరాత్రి ఉత్సవాల అనంతరం వేస్తామని జీహెచ్ఎంసీ అదికారులు తెలిపారు. బస్తీలో రోడ్ల నిర్మాణం పూర్తిచేయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు బస్తీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.