మైలార్‌దేవ్‌పల్లి,జూలై 2: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య డిమాండ్ చేశారు. శనివారం కాటేదాన్ సీఐటీయూ రంగారెడ్డి కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ..కార్పొరేట్ లాభాలకు గ్యారంటీ చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లతో కార్మికులకు ప్రమాదం పొంచి ఉన్నదని అన్నారు. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు జగదీశ్ ,చంద్రమోహన్, రాష్ట్ర నాయకులు కూరపాటి రమేశ్, శ్రామిక మహిళ కన్వీనర్ కవిత, జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రకుమార్, కిషన్, రవికుమార్, పెండ్యాల బ్రహ్మయ్య, కేసరి నర్సింహారెడ్డి, జీఎం కురుమయ్య, జిల్లా కమిటీ సభ్యులు కుర్మయ్య, క్రిష్ణ, శేఖర్, బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు.