శంషాబాద్ రూరల్, జూన్ 22 : ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ పట్టణంలోని హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. శంషాబాద్‌లో డిగ్రీ కళాశాల లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లలేక ఇంటర్మీడియట్తోనే విద్యకు దూరమవుతున్నారని చెప్పారు.
కళాశాల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని, సీఎం స్పందించి శంషాబాద్‌లో నూతన డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో ప్రారంభించినట్లు వివరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలలో మొదటగా 240 సీట్లు కేటాయించారని, వాటిని భర్తీచేసి విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. సమావేశంలో గణేశ్ గుప్త, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ గోపాల్, ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్వి, ఎంఈవో రాంరెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్‌గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దండు ఇస్తారి, కౌన్సిలర్లు మేకల వెంకటేశ్, రేఖ గణేశ్ గుప్త, జహంగీర్ ఖాన్, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్ యాదవ్, నాయకులు నీరటి రాజు ముదిరాజ్, మంచర్ల శ్రీనివాస్, అంజాద్ భాయ్, తాజ్ బాబా, హన్ముంతు, జీవై ప్రభాకర్, పలువురు ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.