కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 10 : గోపాల్‌నగర్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీలోని గోపాల్‌నగర్ పైప్‌లైన్ రోడ్డు, కాలనీ 5వ ఫేజ్‌లలో ప్రజా సమస్యలను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్‌రావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. గోపాల్‌నగర్ రోడ్డులో భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ పనుల కారణంగా రోడ్డును మూసివేయడం జరిగిందని.. పనులు పూర్తైన నేపథ్యంలో ఈ రోడ్డును పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులతో హఫీజ్‌పేట, కేపీహెచ్‌బీ కాలనీ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. నియోజకవర్గంలో కేపీహెచ్‌బీ 5వ ఫేజ్ మలేషియన్ టౌన్షిప్ వద్ద డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేదుకు వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పార్కు పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాజేశ్‌రాయ్, సాయిబాబా చౌదరి, ఉప కమిషనర్ రవికుమార్, జలమండలి జీఎం తదితరులు పాల్గొన్నారు.
20న ఆర్వోబీ ప్రారంభం..
కైత్లాపూర్ అయ్యప్ప సొసైటీ మార్గంలో నూతనంగా నిర్మించిన ఆర్వోబీని ఈనెల 20న ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆర్వోబీ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్వోబీ ప్రారంభోత్సవం నాటికి పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్వోబీ కింద పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీషాబాబురావు, సబీహా గౌసుద్దీన్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ..
ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా రోడ్లను విస్తరించాలని.. ఆయా ప్రాంతాల్లో బాటిల్ నెక్‌గా ఉన్న రోడ్ల విస్తరణపై ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో హైదరాబాద్ సీసీపీ దేవేందర్ రెడ్డి, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కైత్లాపూర్ బ్రిడ్జి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మూసాపేట రోడ్డులో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందన్నారు.
మూసాపేట, ఆంజనేయనగర్ రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని కోరారు. రోడ్డు విస్తరణ బాధితులందరికీ న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. అలాగే బాలానగర్ జీబీఆర్ వైద్యశాల వద్ద రోడ్డును విస్తరించాలని, కైత్లాపూర్, మూసాపేట రోడ్డులో ఐడీఎల్ యాజమాన్యాన్ని ఒప్పించి రోడ్డు విస్తరణ చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, సబీహాబేగం, పగుడాల శిరీషాబాబురావు, జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.