ఎల్బీనగర్/మన్సూరాబాద్/చంపాపేట/హయత్‌నగర్/సైదాబాద్/మలక్‌పేట/చాదర్‌ఘాట్, జూన్ 4: ఫతుల్లాగూడలోని ఎనిమల్కేర్ సెంటర్ ప్రాంతంలో భవిష్యత్తులో వరద ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ ఫతుల్లాగూడ ఎనిమల్కేర్ సెంటర్ వద్ద రూ.1.92కోట్లతో నూతనంగా నిర్మించనున్న బాక్స్‌టైప్ డ్రైన్ పనులకు శనివారం స్థానిక కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్లీవ్స్ విల్లాస్ కార్యదర్శి మోహన్‌రెడ్డి, కార్యవర్గసభ్యులు రాజేశ్వర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఎస్.సాయిశ్రీనివాస్, నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, నాయకులు చెరుకు ప్రశాంత్‌గౌడ్, తూర్పాటి కృష్ణ, సతీశ్‌యాదవ్, కట్టా ఈశ్వరయ్య, కాటెపాక రవి, భాస్కర్‌యాదవ్, కందికంటి రాఘవేందర్‌గౌడ్, శ్యాంసుందర్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, అశోక్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ హయత్‌నగర్ పరిధి వీరన్నగుట్టలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి, మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, పోచబోయిన జగదీశ్‌యాదవ్, కొసనం వెంకట్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి వెంకన్న కురుమ, బీసీ సెల్ అధ్యక్షుడు రుద్ర యాదగిరి, కార్యనిర్వాహక కార్యదర్శి చెంగల్ చంద్రమోహన్, నాయకులు అత్తాపురం రాంచంద్రారెడ్డి, పారంద నర్సింగ్‌రావు, కేకేఎల్ గౌడ్, ఆనంద్‌యాదవ్ పాల్గొన్నారు.
ప్రజలు భాగస్వాములు కావాలి..
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం చంపాపేట డివిజన్ ఈస్ట్ మారుతీనగర్ కాలనీలో ఎల్బీనగర్ సర్కిల్ ఉప కమిషనర్ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు.
వరదనీటి కాలువ పనులు ప్రారంభం..
చంపాపేట డివిజన్ పరిధిలోని శివారెడ్డి అపార్ట్మెంట్ మొదలుకొని కాకతీయ స్కూల్ ముందు నుంచి చంపాపేట చౌరస్తా సమీపంలోని డీమార్ట్ షాపింగ్ మాల్ వరకు రూ.4కోట్లతో వరదనీటి కాలువ నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్-4 ఏఈ జాన్, వాటర్ వర్క్స్ మేనేజర్ రమ్యభారతి, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ ధర్మకర్తలు చేగోని మల్లేశ్‌గౌడ్, యాదిరెడ్డి, టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, టీఆర్ఎస్ చంపాపేట మహిళా వింగ్ అధ్యక్షురాలు రోజారెడ్డి, నాయకులు సరోజ, గూడూరు గౌతంరెడ్డి, మెట్టు వెంకట్‌రెడ్డి, సామ శ్రీధర్‌రెడ్డి, రవిముదిరాజ్, ఉమామహేశ్వర్, గౌరిదేవి రాజు, మద్దెల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో స్వచ్ఛ కాలనీలు
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా స్వచ్ఛ కాలనీలుగా మారుస్తున్నామని సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా న్యూ మారుతీనగర్ కాలనీలో పారిశుధ్య పనులతో పాటు వ్యర్థాలు తొలగించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి, విజయరంగా పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
హయత్‌నగర్ డివిజన్లోని ఆటోసాయినగర్, అరుణోదయనగర్ కాలనీల్లో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, ఇంజినీరింగ్ విభాగం, ఎంటమాలజీ, హార్టికల్చర్, వివిధ శాఖల అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
పారిశుధ్యమే ధ్యేయంగా ..‘పట్టణ ప్రగతి’
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణి ఆఫీసర్స్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ అలివేలుమంగతాయారు మాట్లాడుతూ.. కాలనీల్లో వ్యర్థాలను తొలగించటానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సంతోష్‌నగర్ సర్కిల్ డీపీవో రత్నమ్మ, సీవో యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
మూసారాంబాగ్‌లోని రామాలయం వీధి నుంచి అరోరా కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్ భాగ్యలక్ష్మీమధుసూదన్రెడ్డి, డీసీ జయంత్, ఏఈ వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఆజంపురా డివిజన్లో జీహెచ్ఎంసీ అధికారులు, డివిజన్ ఎంఐఎం నాయకుడు షేక్ మొహియుద్దీన్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టణప్రగతిలో పాల్గొనకుంటే.. ప్రజలే బుద్దిచెబుతారు
పట్టణప్రగతి డబ్బులతో ముడిపెట్టుకున్నది కాదని.. గతంలో నిధులు కేటాయించలేదని పట్టణప్రగతిని బహిష్కరిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రజలే తగినరీతిలో బుద్ధిచెబుతారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. పట్టణప్రగతి కార్యక్రమం ద్వారా పరిసరాలను పరశుభ్రం చేయడం, చిన్నపాటి మరమ్మతులు, కుంగిపోయిన మ్యాన్‌హోళ్ల పునరుద్ధరణ, మంచినీటి, డ్రైనేజీ లీకేజీలను అరికట్టడం తదితర పనులను నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని కొందరు ప్రజాప్రతినిధులు బహిష్కరించడం దురదృష్టకరమని తెలిపారు. గతంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించిన నిధులు మంజూరు చేయలేదనే కారణంతో బహిష్కరించామని చెబుతున్నారు. పట్టణప్రగతికి డబ్బులు అవసరం లేదని.. శానిటేషన్ సిబ్బందిని తీసుకుని తమ తమ పరిధిలలోని ఖాళీ స్థలాలు, రోడ్ల వెంట ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించుకోవాలని సూచించారు. పట్టణప్రగతిలో పాల్గొనని వారి పట్ల మాట్లాడేది ఏమిలేదని వారి విచక్షణకే వదిలిపెడుతున్నామని తెలిపారు. పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణను అభినందిస్తున్నానని తెలిపారు.