పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపు లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతికి మంచి స్పందన లభించింది. కూకట్పల్లి జోన్ పరిధిలో ఐదు సర్కిళ్లలో పట్టణ ప్రగతిని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు లాంఛనంగా ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు, కాలనీవాసుల సహకారంతో ఎంపిక చేసిన కాలనీలలో పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు.
బాలానగర్, జూన్ 3 : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధి హస్మత్‌పేట చౌరస్తాలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్, జడ్సీ మమతతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హస్మత్‌పేట చౌరస్తాలో రోడ్లను శుభ్రం చేయించారు. మానససరోవర్ హైట్స్ ప్రాంతంలో రోడ్డు ఆక్రమణలను సైతం తొలగింపజేశారు. పలుచోట్ల మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో డీసీ రవీందర్‌కుమార్, ఈఈ గోవర్ధన్‌గౌడ్, టీఆర్ఎస్ నేతలు నరేందర్‌గౌడ్, సయ్యద్ ఎజాజ్, బల్వంత్‌రెడ్డి, మక్కల నర్సింగ్, ఇర్ఫాన్, హరినాథ్, కర్రె జంగయ్య, కర్రె లావణ్య, లలిత, సరోజలతో పాటు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తొలిరోజు 671 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తరలింపు
కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 3 : కూకట్పల్లి జోన్‌లోని మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లు ఉన్నాయి. పట్టణ ప్రగతిలో 74 బృందాలు, 456 మంది సిబ్బంది, 115 వాహనాలు పట్టణ ప్రగతిలో పాల్గొన్నాయి. తొలిరోజు జోన్లో 671 మెట్రిక్ టన్నుల చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలను తొలగించారు. 225 మెట్రిక్ టన్నుల గార్బెజ్, 446 మెట్రిక్ టన్నుల డెబ్రిస్‌ను తొలగించారు. 25.42 కి.మీ. దూరం ప్రధాన రహదారులను పరిశుభ్రంగా మార్చారు. 2.52 కి.మీ. దూరం నాలాలలో వ్యర్థాలను తొలగించే పనులను చేశారు. 270 పబ్లిక్ టాయిలెట్లు, 10 పబ్లిక్ ప్లేస్‌ను పరిశుభ్రంగా మార్చారు. కాలనీలు, బస్తీలలో 265 మొక్కలను నాటినట్లు అధికారులు తెలిపారు.
కేపీహెచ్‌బీ కాలనీలో..
కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లో పరిసరాలు, క్రీడా ప్రాంగణాలను పరిశుభ్రంగా మార్చడం, కాలనీ 6వ ఫేజ్ ఫార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, డీసీ రవికుమార్‌లు ప్రారంభించారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, సాయిబాబా, శ్యామలరాజు, నారాయణరాజు, రాజేశ్, బత్తుల హరిబాబు, అంజిబాబు, ప్రతాప్, రామారావు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
బాలాజీనగర్‌లో..
కేపీహెచ్‌బీ మొదటి రోడ్డులో చేపట్టిన పట్టణ ప్రగతిని కార్పొరేటర్ శిరీషాబాబురావు ప్రారంభించి పార్కులో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పవన్‌కుమార్, ప్రభాకర్ గౌడ్, సుశీల్, భాస్కర్‌రావు, శారద, దినేశ్, నాగేశ్వర్రావు, నవీన్ పాల్గొన్నారు.
కూకట్‌పల్లిలో..
ప్రశాంత్‌నగర్‌లో పట్టణ ప్రగతిని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు సంతోష్, కృష్ణ, ప్రభాకర్, శ్రీను, మహేశ్, రమేశ్, శంకర్, నితిన్, అధికారులు పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
పట్టణ ప్రగతిని కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ప్రారంభించి స్వయంగా చెత్తను ఎత్తి ట్రాక్టర్లో పోశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
మియాపూర్‌లో..
మియాపూర్ : వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి, హైదర్‌నగర్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు , ఆల్విన్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్లు అధికారులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ రంగారావు సహా స్థానిక డివిజన్ల నేతలు, అధికారులు పాల్గొన్నారు.
అల్లాపూర్ డివిజన్లో..
అల్లాపూర్: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్‌నగర్, గాయత్రినగర్, రామారావునగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ సబీహాబేగం మూసాపేట సర్కిల్-23 ఉపకమిషనర్ రవికుమార్‌తో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ ప్రగతి నోడల్ ఆఫీసర్ ప్రభాకర్, టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, నాగుల సత్యం, సంపత్‌రెడ్డి, సంజీవ, హమీద్, రాముయాదవ్, కాశీనాథ్చారి, యోగి రాజ, ఇస్మాయిల్, నీజర్, పార్వతమ్మ, పర్వీన్‌సుల్తానా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గౌతంనగర్‌లో..
బాలానగర్ : గౌతంనగర్ పాత విమానాశ్రయం రోడ్డులో నిర్వహించిన కార్యక్రమానికి ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ పాటు జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో డీఈ శ్రీదేవి, ఏఈ పవన్, శానీటేశన్ పోచయ్య పాల్గొన్నారు.
మూసాపేటలో
మూసాపేట: పట్టణప్రగతి కార్యక్రమంలో మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కరుణాకర్, ఇనుగంటి రాజు, అరుణ్, నర్సింగ్, అక్బర్, పవన్, రవీందర్, కృష్ణ, అర్జున్, సత్తయ్య, సూర్యకళ, శాంత, యాదగిరి, సంజీవ, నాగరాజు, గాయత్రి పాల్గొన్నారు.