అల్లాపూర్,మే14: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపురి కాలనీ, కబీర్‌నగర్ మొదల గు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి.వానకాలం లోపే పనులు పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. రామారావునగర్ నుంచి బబ్బుగూడ వరకు ప్రవహించే నాలా ప్రస్తుతం కుచించుకుపోవడంతో వర్షం కురిసినప్పుడు బస్తీలు, కాలనీలను వరద ముంచెత్తేది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఐదు దశ్దాలుగా ఎందరో నాయకులు వచ్చారు కానీ.. నాలా సమస్య ఎక్కడ వేసిన గొంగ ళి అక్కడే అన్న చందంగా మారింది.
ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కృష్ణారావు, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి నాలా విస్తరణకు నిధులు మంజూరు చేయిండమే కాకుండా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రూ .7.5 కోట్లతో పనులను ప్రారంభింప చేయించారు. రామారావునగర్ మొదలుకొని వివిధ కాలనీల్లో మీదుగా బబ్బుగూడ వరకు మొత్తం కిలోమీటరు మేర నాలాకు ఇరువైపులా ఐదు మీటర్ల వెడల్పుతో ఆర్సీసీ రిటర్నింగ్ వాల్ నిర్మిస్తున్నారు.ఇప్పటి వరకు 400 మీటర్ల మేర విస్తరణ పనులు పూర్తి కాగా, నిర్మాణానికి ఆంటంకాలను అధిగమించి పనులు వేగంగా పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుండడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో పనులు పూర్తి చేస్తాం..
నాలా అభివృద్ధి పనులు త్వర లో పూర్తి చేసి వరద సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుం టాం. ఎక్కడైతే నాలా కుచించుకుపోయిం దో మొదటగా అక్కడే విస్తరణ పనుల జరిగేలా చర్యలు తీసుకున్నాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం.
–డీఈ ఆనంద్
గత పాలకులు పట్టించుకోలేదు..
కబీర్‌నగర్,బబ్బుగూడ, స్నేహపురి కాలనీ,రామారావునగర్ వీదుగా ప్రవహించే నాలా కుచించుకుపోవడంతో ఐదు దశాబ్దాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత పాలకులు ఈ సమస్యను పట్టిం చుకోలేదు. మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.7.5 కోట్ల నిధులు మంజూరు చేసి తానే స్వయం గా విస్తరణ పనులను ప్రారంభించారు. పనులు కొనసాగుతున్నాయి.
–ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు