సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : రాచకొండ పోలీసు కమిషనరేట్ సీసీఎస్‌కు చెందిన ఇన్స్పెక్టర్ దేవేందర్‌ను పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. ఫిబ్రవరిలో రాచకొండ పోలీసులు సీసీఎస్ పోలీసులు లారీ టైర్ల కంటెయినర్లను లూటీ చేసే హర్యానాకు చెందిన ముఠాను అరెస్టు చేశారు. దాదాపు రూ. 40 లక్షల విలువైన 192 లారీ టైర్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో హర్యానా ముఠా నుంచి లారీ టైర్లను కొనుగొలు చేసిన వ్యాపారి కమల్ కాబ్రను కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఆ సమయంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ దేవేందర్ అతని డెబిట్ కార్డు, పిన్ నెంబరు తెలుసుకుని ఓ మ హిళతో 5.50 లక్షలు విత్ డ్రా చేసిన వ్యవహరం పోలీసు వర్గాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.ఈ సంఘటన పై దర్యాప్తు చేసిన పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ పూర్తి ఆధారాలు లభించడంతో దేవేందర్‌ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.