కుత్బుల్లాపూర్,మే10: ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం పేట్ బషీరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజలు, వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు తమ కాలనీల్లోని స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. స్పందించిన ఆయన ఆయా శాఖల అధికారులతో ఫోన్లైన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డులో కౌన్సిలర్ సరితశివకుమార్ ఆధ్వర్యంలో స్థానికంగా నెలకొన్న తాగునీటి సమస్య ను పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందించా రు. సంబంధిత వాటర్ వర్క్స్ విభాగం అధికారులకు ఆదేశించగా వెంటనే కాలనీల్లో పర్యటించి వారం రోజుల్లోగా పనులు ప్రారంభించి నీటి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని వాట ర్ వర్క్స్ జీఎం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.