బియ్యం ధరలతో బ్యానర్లు తప్పనిసరి
బియ్యం ధరలను నియంత్రించడం, వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం, బియ్య వ్యాపారంలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యం తో కీలక నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ జిల్లా ముఖ్య రేషనింగ్ అధికారి పేర్కొన్నారు.
సిటీబ్యూరో: బియ్యం ధరలను నియంత్రించడం, వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం, బియ్య వ్యాపారంలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యం తో కీలక నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ జిల్లా ముఖ్య రేషనింగ్ అధికారి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో బియ్యం ధరలను సూచిస్తూ హైదరాబాద్ జిల్లాలో ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసినట్లుగా బ్యానర్ల నమూనాను విడుదల చేశారు.
ప్రభుత్వం, పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ బియ్యం వ్యాపారులతో నిర్వహించిన చర్చల అనంతరం వివిధ రకాల బియ్యానికి కిలోకు గరిష్ట చిల్లరధరలను నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం 26 కిలోల బ్యాగ్ ప్యాక్‌లలో విక్రయించే బియ్యం రకాల వారీగా బీపీటీ/కేఎన్ఎమ్ రూ.66, ఆర్ఎన్ఆర్/తెలంగాణసోనా రూ.74, హెచ్ఎంటీ/జేఎస్ఆర్ రూ.79 ధరలుగా నిర్ణయించి ప్రత్యేక బ్యానర్‌ను రూపొందించారు.
బియ్యం విక్రయ కేంద్రాల్లో ఈ బ్యానర్లను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. అధిక ధరలకు బియ్యం విక్రయించరాదని, హైదరాబాద్ జిల్లాలో సీఎస్ డిపార్ట్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారని జిల్లా ముఖ్య రేషనింగ్ అధికారి పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

