Job Fraud | ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ నుంచి రూ.4.50 లక్షలు వసూలు.. ఆపై రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారం
Job Fraud | ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.4.50 లక్షలు వసూలు చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Job Fraud | ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.4.50 లక్షలు వసూలు చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మల్లాపూర్‌లోని బ్రహ్మపుత్ర కాలనీలో టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న 30 ఏళ్ల మహిళకు భువనగిరికి చెందిన జగన్మోహన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ మేనేజర్‌గా పనిచేస్తున్నానని, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకోసం ఉన్నతాధికారికి డబ్బులు ఇవ్వాలని, మొత్తం రూ.5 లక్షలు ఖర్చవుతాయని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగం వస్తుందనే ఆశతో బాధితురాలు విడతలవారీగా రూ.4.50 లక్షలు నిందితుడికి ఇచ్చినట్లు సమాచారం.
అనంతరం ఉద్యోగం ఇప్పించే విషయమై మాట్లాడాలంటూ జగన్మోహన్ బాధితురాలిని కారులో తీసుకెళ్లాడు. మల్లాపూర్ నుంచి భువనగిరికి వెళ్తున్నట్లు చెప్పి, మార్గమధ్యంలో ఘట్కేసర్ పరిధిలోని అవుషాపూర్‌లో ఉన్న ఓ రిసార్ట్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది. అక్కడ ఉన్నతాధికారి ఉన్నారని మహిళను నమ్మించిన నిందితుడు, అనంతరం ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అఘాయిత్యం అనంతరం బాధితురాలిని కారులో తీసుకెళ్తున్న జగన్మోహన్.. వరంగల్ జాతీయ రహదారిపై ఆమెను కారు నుంచి కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం జగన్మోహన్ను అరెస్టు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Job Fraud | ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ నుంచి రూ.4.50 లక్షలు వసూలు.. ఆపై రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారం
Car Race: బ్రిటన్‌లో కారు రేస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలుశిక్ష
Nani | ‘బ్లడీ రోమియో’లో బాలీవుడ్ నటుడు.. కీలక పాత్రలో కనిపించనున్న ‘ధురంధర్’ ఫేమ్!
Sowcar Janaki | షావుకారు జానకి కుమార్తెకు ప్రమాదం.. వీల్‌చైర్ నుంచి కిందపడి ఇబ్బందులు..!
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

