పాతబస్తీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు : సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తున్న పాతబస్తీ ప్రజలకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మక్కామసీదు, చార్మినార్ వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ శుక్రవారం మధ్యాహ్నం చార్మినార్ వద్దకు వెళ్లి ప్రార్థనల అనంతరం నెలకొన్న పరిస్థితులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో షాపులు, హోటల్స్ రాత్రి 10 వరకు తెరిచి ఉంచే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి రాత్రి 8 గంటలకే షాపులు, హోటల్స్‌ను మూసివేయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనను సడలించే విషయంపై పోలీసులు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ఆనంద్ హెచ్చరించారు. ఇటీవల అల్లర్లకు ప్రయత్నించిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నగర ప్రజలంతా చూశారని ఆయన తెలిపారు. మతవిద్వేషాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ విషయంలో తమపై నమ్మకం ఉంచాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

