Hyd Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల గురువారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, బషీర్‌బాగ్, లిబర్టీ వానపడుతున్నది. హిమాయత్‌నగర్, నారాయణగూడ, నాంపల్లి, అబిడ్స్, బోయినపల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, చిలుకలగూడ, సీతాఫల్మండి, అల్వాల్, పాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, బాలానగర్, దుండిగల్, సూరారం, బహదూర్‌పల్లి, జగద్గిరిగుట్ట, మల్లంపేటలోనూ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల రోడ్లపై వర్షం నీరు నిలిచింది.