హైదరాబాద్ : మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. జగద్గిరిగుట్టకు చెందిన అనిల్‌కు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొద్ది కాలం నుంచి మరో మహిళతో అనిల్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెతో కలిసి కుత్బుల్లాపూర్‌లోని బ్యాంకు కాలనీలో అనిల్ ఉంటున్నట్టు భార్యకు తెలిసింది.
దీంతో శనివారం ఉదయం బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకు కాలనీకి చేరుకుని అనిల్‌తో పాటు అతని ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.