Hyderabad | కుండపోత వర్షం.. వాహనాదారులకు నరకం… పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి వరకు నిలిచిన ట్రాఫిక్..
Hyderabad | హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. పలు బస్తీలు, కాలనీలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. పలు బస్తీలు, కాలనీలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. గంట వ్యవధిలో 9 సెం.మీ. వర్షపాతం కురిసింది.
పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి వరకు జూబ్లీహిల్స్ మీదుగా, ఖైరతాబాద్ నుంచి బేగంపేట్ వరకు, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు, మలక్‌పేట్ నుంచి హయత్‌నగర్ వరకు, బషీర్‌బాగ్ నుంచి కోఠి మీదుగా మలక్‌పేట్ వరకు, ట్యాంక్‌బండ్ నుంచి ఎస్పీరోడ్, ఆర్పీరోడ్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్క వాహనం కూడా ముందుకు కదలడం లేదు. కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మల్కాజ్గిరి, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్, నాంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్ జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్ – రాజ్‌భవన్ రహదారి నీట మునిగింది.
ఈ క్రమంలో ఎమర్జెనీ బృందాలు అప్రమత్తం అయ్యాయి. సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు నిమగ్నమయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనుల్లో విద్యుత్ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

