హడలెత్తిస్తున్న వానలు
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం హడలెత్తిపోతున్నది. గ్రేటర్‌లోని పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
- విరిగిపడుతున్న చెట్ల కొమ్మలు
- చెరువులను తలపిస్తున్న రహదారులు..
- బల్దియా టోల్‌ఫ్రీకి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
- మరో రెండు రోజులు వానలు : వాతావరణ శాఖ
సిటీబ్యూరో: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం హడలెత్తిపోతున్నది. గ్రేటర్‌లోని పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బల్దియా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వెల్లువెతున్నాయి. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్, ఇంజినీరింగ్ , యూబీడీ, డీఆర్ఎఫ్, విద్యుత్ అన్ని శాఖల సమన్వయంతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.
భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడ్డ ముంపు, నీరు నిలిచే ప్రాంతాలు, విరిగి పడిన చెట్లను వెంటనే తొలగించడం, నాలాలకు తాతాలిక మరమ్మతులు చేపట్టి..ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన దరిమిలా.. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నాయి. వర్షాలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నం. 21111111, 100, ట్రాఫిక్ సమస్యలపై పోలీసుల వాట్సాప్, హాక్ ఐ లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ
ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు 52 ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. చెట్లు, కొమ్మలు పడటం, నాలా పైకప్పు పూర్తిగా ధ్వంసం కావడం, నీరు నిల్వడం వంటివి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో 50 ఫిర్యాదులకు పరిష్కారం చూపగా, రెండు చోట్ల సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
విరిగిపడిన చెట్లు.. కొమ్మల తొలగింపు..
ఇందిరానగర్, ఏఎస్రావు నగర్, ఎంజీబీఎస్, గుడిమల్కాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, సోమాజిగూడ, కొత్తపేట, రామంతాపూర్, ఎల్బీనగర్, అలీ కేఫ్, కొత్తపేట, నాగోల్, దిల్సుఖ్నగర్, గౌలిపుర, గడ్డి అన్నారం, అంబర్‌పేట, షేక్‌పేట వద్ద చెట్లు విరిగిపడ్డాయి. డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని విరిగి పడిన కొమ్మలు, నెలకొరిగిన చెట్లను తొలగించాయి. ఆయా ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సాఫీగా నీరు వెళ్లేలా..
బీహెచ్ఈఎల్ క్రాస్‌రోడ్, లింగంపల్లి రైల్వే స్టేషన్, శిల్పారామం, విప్రో, ప్రశాంత్‌నగర్, ఐడీపీఎల్ చింతల్, తుకారంగేట్, మలక్‌పేట, బయో డైవర్సిటీ, జగద్గిరిగుట్ట, బంజారాహిల్స్, జేఎన్టీయూ, ఏఎస్‌రావునగర్, తార్నాక, సుచిత్ర, చంపాపేట, మల్లాపూర్, హస్తినాపురం తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు నీరు నిలిచిన ప్రాంతాల్లో సాఫీగా నీరు వెళ్లేలా చర్యలు చేపట్టి.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

