Rain | హైదరాబాద్ జంటనగరాల పరిధిలో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుండగా.. నగరాన్ని నల్లటి ధట్టమైన మేఘాలు కమ్మేశాయి. నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, తిరుమలగిరి, అల్వాల్, బోయినపల్లి, జవహర్‌నగర్, బేగంపేట, బొల్లారం, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, తార్నాక, ఓయూ, లాలాపేట, హబ్సీగూడలో భారీ వర్షం కురుస్తున్నది.
మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్, చైతన్యపురి, గుడి మల్కాపూర్, నాంపల్లి, మల్కపేట, దిల్సుఖ్నగర్, ఖైరతాబాద్, పంజాగుట్టా, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, సుల్తాన్‌బజార్, బేగంబజార్, బషీర్‌బాగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వాన కురుస్తున్నది. కూకట్పల్లి, కాచిగూడ, విద్యానగర్, అంబర్‌పేట, ఉప్పల్, ఘట్కేసర్, రాజేంద్రనగర్, గండిపేట, కోఠి, అబిడ్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. భారీ వర్షంతో రోడ్లపై వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులపడుతున్నారు. మరో వైపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతున్నది.
మరో వైపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతున్నది. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచాయి. వర్షంధాటికి దారి కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షంతో డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఈ సందర్భంగా టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. అవసరముంటే 040-21111111, 9000113667 నంబర్లలో సంప్రదించాలని డీఆర్ఎఫ్ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి రావ్దొదని కోరింది.