హైదరాబాద్: హైదరాబాద్‌లో (Hyderabad) వరణుడి విజృంభణ కొనసాగుతున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి జీహెచ్ఎంసీ (GHMC) వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉన్నది. మరో రెండు గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షం (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ (Red alert) జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
కాగా, రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రికార్డు స్థాయిలో వర్షపాతం (Rain fall) నమోదయింది. మియాపూర్‌లో (Miyapur) అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక బండ మైలారంలో 13.8 సెం.మీ., దుండిగల్ ఫారెస్ట్ అకాడమీలో 12.9 సెం.మీ., కూకట్పల్లి హైదర్‌నగర్‌లో 12.7 సెం.మీ., మాదాపూర్‌లో 10.7 సెం.మీ., శేరిలింగంపల్లి 11.45 సెం.మీ., షేక్‌పేటలో 11.9 సెం.మీ., బోరబండ 11.6 సెం.మీ., గాజుల రామారం 10.9 సెం.మీ., షాపూర్లో 10.6 సెం.మీ., బాచుపల్లి, రాయదుర్గంలో 10.1 సెం.మీ., ఖైరతాబాద్ 10.1 సెం.మీ., రాజేంద్రనగర్‌లో 10 సెం.మీ., గచ్చిబౌలిలో 9.6 సెం.మీ., బహదూర్‌పురా 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.