పేకాడుతూ పట్టుబడ్డ.. కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు
కూకట్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావుతోపాటు మరో ఐదుగురు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
శేరిలింగంపల్లి, జనవరి 29: కూకట్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావుతోపాటు మరో ఐదుగురు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు ఈనెల 16న ఆర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గచ్చిబౌలిలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఓ గెస్ట్హౌజ్లో తన స్నేహితులు ఐదుగురు స్థిరాస్తి వ్యాపారులతో కలిసి పేకాట ఆడుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. అక్కడ స్పేహితులతో కలిసి పేకాట ఆడుతున్న కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావుతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో సెల్ఫోన్లతో పాటు నగదు రూ.1,27,000 లభించింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంగళరావుతోపాటు మరో ఐదుగురిపై కూడా గేమింగ్ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ గోన సురేశ్ పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

