సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ) కొత్త సెక్రటరీ జనరల్‌గా అవినాశ్ నియమితులయ్యారు. శుక్రవారం హెచ్సీఎస్సీ కార్యవర్గ సమావేశం నిర్వహించగా, త్యాగరాజన్ మురళీధర్( ఫిక్కీ చైర్మన్, టీఎంఐ గ్రూప్ చైర్మన్), భాస్కర్‌రెడ్డి (ఫిక్కీ ప్రెసిడెంట్, ఎండీ క్రిమ్లైన్ డైరీ ప్రొడెక్ట్స్)లతో పాటు క్రెడాయ్ చైర్మన్ రామకృష్ణారావు గౌరవ కమిటీ సభ్యులుగా చేరారు. సీపీ అంజనీకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అదనపు సీపీ చౌహాన్, జాయింట్ సీపీలు ఏఆర్ శ్రీనివాస్, రమేశ్, డీసీపీ కమలేశ్వర్, ఎల్ఎస్ చౌహాన్, షీ టీమ్స్ అదనపు డీసీపీ శిరీషా రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.