హెచ్‌సీఏ సభ్యుల బ్లాక్ టికెట్ల దందా
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సభ్యులు మరోసారి బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారు. భారత్-వెస్టిండీస్ టీ20 కోసం వర్ధమాన క్రికెటర్ల కోసం ఉచితంగా కేటాయించిన టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఓ సభ్యుడు పోలీసులకు చిక్కాడు. హెచ్‌సీఏ సభ్యుడు యంగ్ సిటిజన్స్ క్లబ్‌కు చెందిన సతీశ్ చంద్ర శ్రీవాత్సవ తన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవతో టికెట్ల విక్రయానికి పాల్పడి అరెస్టయ్యాడు.
- సతీశ్ శ్రీవాత్సవ సహా నలుగురు అరెస్ట్
సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సభ్యులు మరోసారి బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారు. భారత్-వెస్టిండీస్ టీ20 కోసం వర్ధమాన క్రికెటర్ల కోసం ఉచితంగా కేటాయించిన టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఓ సభ్యుడు పోలీసులకు చిక్కాడు. హెచ్‌సీఏ సభ్యుడు యంగ్ సిటిజన్స్ క్లబ్‌కు చెందిన సతీశ్ చంద్ర శ్రీవాత్సవ తన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవతో టికెట్ల విక్రయానికి పాల్పడి అరెస్టయ్యాడు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా బ్లాక్ టికెట్లను విక్రయిస్తున్నట్టు పక్కా సమాచారంతో గోషామహల్ పోలీసులు బేగంబజార్‌లో అవినాశ్ దారక్, మోహిత్ సోమాని అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 11 కాంప్లిమెంటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో హెచ్‌సీఏ సభ్యుడైన సతీశ్ చంద్ర నుంచి అతడి కుమారుడు ఆకర్షిత్ ఈ ఉచిత టికెట్లను పొందగా, ఆ వ్యక్తి ద్వారా తాము వాటిని సంపాదించినట్లు నిందితులు పోలీసులకు వెల్లడించారు. దీంతో పోలీసులు దారక్, సోమానితో ఆకర్షిత్, సతీశ్‌చంద్రను అరెస్టు చేసి కోర్టు అనుమతితో జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌సీఏ సభ్యుల బ్లాక్ టికెట్ల దందా
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

