హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతుండటంతో భారీగా మద్యం, నగదు పట్టుబడుతున్నది. తాజాగా ఎస్ఆర్నగర్(SR Nagar) పరిధిలో భారీగా హవాలా(Hawala money) నగదు పట్టుబడింది. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వద్ద రూ.13 లక్షల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.