రేవంత్ రియల్ దందా
మూసాపేటలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన ‘ట్రక్ పార్' భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి హరీశ్‌రావు ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక ప్రజలు, ట్రక్ డ్రైవర్లు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై స్థానికులు హరీశ్‌రావు ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
-
కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
-
రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
-
వేలంలో ఎవరు భూములు కొన్నా అనుమతులు ఇవ్వం
-
మళ్లీ వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకే వాడుతాం
-
సీఎం కుర్చీలో కూర్చుని రేవంత్ రియల్ ఎస్టేట్ దందా
-
ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా రంగుల మార్పు
-
ట్రక్ పార్ భూముల వేలంపై బీఆర్ఎస్ నిరసన
‘బిడ్డా జాగ్రత్త.. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. వేలంలో ఎవరు భూములు కొన్నా.. అనుమతులు రావు.. ఆ భూములను మళ్లీ వెనక్కి తీసుకొని ప్రజా అవసరాలకే వాడుతాం.. కాబట్టి ఎవరూ వేలంలో పాల్గొని మోపోవద్దు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఏడ భూమి కనిపిస్తే అకడ అమ్ముడే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు నిత్యం భూముల చుట్టే తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తున్నారని మండిపడ్డారు.
సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : మూసాపేటలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన ‘ట్రక్ పార్’ భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి హరీశ్‌రావు ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక ప్రజలు, ట్రక్ డ్రైవర్లు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై స్థానికులు హరీశ్‌రావు ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రక్‌పార్కు భూముల వేలాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని, స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనలో ల్యాండ్, శాండ్, కోల్ సామ్‌లు తప్ప.. పరిపాలన కన్పించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏకంగా రూ. లక్ష కోట్ల భూములను అమ్మకానికి పెట్టగా, ఇప్పటికే రూ. 26 వేల కోట్ల స్థలాలు అమ్మేశారని ఆరోపించారు. విద్యార్థులు, మేధావులు వ్యతిరేకిస్తున్నా వినకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు, హెచ్ఎండీఏకు చెందిన 800 ఎకరాలను రాత్రికి రాత్రే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదువబెట్టి రూ. 20 వేల కోట్ల అప్పు తెచ్చారని మండిపడ్డారు.
ఆ అప్పు ఇప్పించినందుకు ముంబైకి చెందిన ఒక బ్రోకర్‌కు ప్రభుత్వ ఖజానా నుంచి అధికారికంగా రూ. 500 కోట్ల లంచం కట్టబెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. రేపు ఆ అప్పు కట్టకపోతే ఆ యూనివర్సిటీ భూములు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పరం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మియాపూర్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టుల్లో పోరాడి కాపాడుకున్న 400 ఎకరాలను, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు భూములను అమ్మి మరో రూ. 50 వేల కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా..
‘రేవంత్ రెడ్డి రంగులు మార్చే తీరు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడి ఉరేసుకుంటుంది.. ‘అయ్యో.. నాకంటే స్పీడ్‌గా ఈయన రంగులు మారుస్తున్నాడే’ అని ఆశ్చర్యపోతుంది’ అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ నెల 27న హెచ్ఎండీఏ ద్వారా చేపట్టనున్న భూముల వేలం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. మూసాపేట సర్వే నంబర్లు 121/పీ నుంచి 141 వరకు, 146, 147, 155, 156, 157లలో ఉన్న భూములను విక్రయానికి పెట్టారని తెలిపారు. సర్వే నంబర్ 155లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, 156లో ఉన్న ట్రక్ పారింగ్, హెచ్ఎండీఏ నర్సరీ, ఆర్టీఓ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు కేటాయించిన జాగాను సైతం అమ్మేస్తామనడం దారుణమన్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల మధ్య ఉన్న ఏకైక ఖాళీ స్థలం ఇదేనని, ఇకడ పది లక్షల మంది ప్రజలు ఉంటే.. రాబోయే కాలంలో మరో పది లక్షలు పెరుగనున్నారని పేర్కొన్నారు.
నాటి పోరాట స్ఫూర్తితోనే నేడు అడ్డుకుంటాం
‘2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాం గ్రెస్ ప్రభుత్వం ఈ భూములను అమ్మకానికి పెడితే.. నాడు మాధవరం కృష్ణారావు, సీపీఐ నారాయణ, సీపీఎం రాఘవులు, ఎంపీ వినోద్ కుమార్, నేను.. అందరం కలిసి ఉద్యమించి కాపాడాం. కేసీఆర్ ప్ర భుత్వ హయాంలో ఈ భూమిలో గజం స్థలం కూడా అమ్మలేదు కదా.. ప్రజా ప్రయోజనాల కోసం నర్సరీ, పోలీస్ స్టేషన్లు, ఆర్టీఓ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేశాం. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కన్నేసింది’ అని హరీశ్‌రావు అన్నారు. 1982, జూలై 5న ఎస్సీ, ఎస్టీ పేద రైతుల నుంచి ఎకరాకు లక్ష నుంచి లక్షా ఇరవై వేలు ఇచ్చి ఈ భూములను హుడా సేకరించిందని, ఈ భూమిలో ఇండ్లు కట్టడానికి వీల్లేదని, కేవలం ప్రజా ప్రయోజనాలకే వాడాలని ఆనాడు హైకోర్టు, సుప్రీంకోర్టులో అధికారులు అఫిడవిట్లు దాఖలు చేశారని గుర్తుచేశారు. ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే హెచ్ఎండీఏ అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనే పెద్ద వైపరీత్యం
ప్రజల జీవితాలను విధ్వంసం చేయడానికి తుఫాను, సునామీ, భూకంపాలు అకర్లేదని, రేవంత్‌రెడ్డి పాలన చాలని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎల్‌నినో కరువు కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరంగా మారిందని, హైడ్రా, 22-ఏ పేరుతో పేదల బతుకులను రోడ్డుపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూకట్పల్లి ట్రక్ పార్ భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్, వామపక్షాల ఆధ్వర్యంలో ఉధృత పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాదవరం కృష్ఱారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సొత్తు అమ్మితే ఊరుకోం
కూకట్‌పల్లిలో ప్రజా ప్రయోజనాల కోసం వదిలిన స్థలాలను.. ప్రజల సొత్తును అమ్మితే ఊరుకునేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లిలోని రైతుల నుంచి ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమి తీసుకుందని, నేడు ఆ స్థలాన్ని అమ్ముకుంటే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాకా..కూకట్‌పల్లిలోనే రెండువేల కోట్ల విలువైన ప్రభుత్వ హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్ముకున్నారన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో గజాలలో జాగలను సైతం అమ్ముతున్నారని, కనీసం హెచ్ఎండీఏ అనుమతి లేకుండా భూములను అమ్మడంతో కొన్నవాళ్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని దక్కించుకునేందుకు పోరాటాలు చేయాల్సి వచ్చిందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

