Home
National
Man Dies After Explosive Hidden Inside Rasgulla Detonates In His Mouth In Madhya Pradesh
రసగుల్లాలో బాంబు.. నోట్లో పేలి వ్యక్తి మృతి
మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో ఈ నెల 10న విషాద ఘటన జరిగింది. రసగుల్లా లోపల ఉన్న బాంబు పేలడంతో అది తిన్న ఓ వ్యక్తి(35) తీవ్రంగా గాయపడి చనిపోయాడు.
- మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన
దిండోరి: మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో ఈ నెల 10న విషాద ఘటన జరిగింది. రసగుల్లా లోపల ఉన్న బాంబు పేలడంతో అది తిన్న ఓ వ్యక్తి(35) తీవ్రంగా గాయపడి చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్ర భరౌటియా రాత్రి కుటుంబంతో కలిసి చలి మంట దగ్గర కూర్చొని ఉండగా నిందితుడు పొరుగున ఉండే నిందితుడు రామ్‌భగత్ అతడికి ఓ రసగుల్లా ఇచ్చి తినమన్నాడు.
రాజేంద్ర దాన్ని తినగానే అందులో ఉన్న పందులను చంపే బాంబు పేలి అతడి నోరు, దవడకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని దవాఖానకు తరలించారు. అయితే కొన్ని గంటల తర్వాత అతడు మరణించాడు. తాను ఇచ్చింది రసగుల్లా మాత్రమేనని నిందితుడు చెప్పాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు గల కారణాన్ని, రసగుల్లా లోపల బాంబు ఎలా వచ్చిందన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

