వాణిజ్య
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. దీపావళి తర్వాత డిమాండ్ మందగించడం, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణుల ప్రభావంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం బంగారం ధరలు వరుసగా నాలుగో సెషన్లోనూ రూ.2,500 తగ్గి రూ.1,40,900కు చేరాయి.
-
1.41 లక్షల దిగువకు పుత్తడి
న్యూఢిల్లీ, నవంబర్ 13: బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. దీపావళి తర్వాత డిమాండ్ మందగించడం, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణుల ప్రభావంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం బంగారం ధరలు వరుసగా నాలుగో సెషన్లోనూ రూ.2,500 తగ్గి రూ.1,40,900కు చేరాయి. గత కొన్ని రోజులుగా యథాతథంగా కొనసాగిన వెండి ధరలు భారీగా పడిపోయాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి అన్ని పన్నులు కలుపుకొని రూ.3,500 తగ్గి రూ.1,84,000కు చేరింది. ‘అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, దీపావళి పండుగ సీజన్ తర్వాత రిటైల్ డిమాండ్ తగ్గడం వల్ల శుక్రవారం దేశీయ బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగింది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

