ఫీజు పోరు
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి, కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ ర్యాలీ తీశారు.
మలక్‌పేట, నవంబర్ 13: బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి, కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ ర్యాలీ తీశారు. రోడ్డుపై బైఠాయించి.. రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
‘భూములు అమ్ముతున్నారు.. లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు.. బీసీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే ఓర్వలేకపోతున్నారు.. విద్యార్థుల ఫీజులకు బడ్జెట్ లేదా’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ఈ నిరసనలో బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజీ, రాష్ట్ర బీసీ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు మోడీ రాందేవ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

