Harish Rao | నిరుద్యోగులను వంచించడమే.. 5 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదలపై హరీశ్ రావు
harish rao | తాము అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్, రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒకేసారి 16 వేలు, 17 వేల చొప్పున భారీగా నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో ఇచ్చామని, కేవలం పోలీస్ శాఖ లోనే దాదాపు 48 వేల పోస్టులు భర్తీ చేసామని ఆయన గుర్తుచేశారు.
Harish Rao | పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత, ఈరోజు హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కలిసి.. నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వినతి పత్రం సమర్పించారు. నిరుద్యోగుల ఆవేదనను సావధానంగా విన్న హరీశ్ రావు , కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఓ ప్రెస్ మీట్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్, రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒకేసారి 16 వేలు, 17 వేల చొప్పున భారీగా నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో ఇచ్చామని, కేవలం పోలీస్ శాఖ లోనే దాదాపు 48 వేల పోస్టులు భర్తీ చేసామని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రంలో 19,000 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి, డీజీపీ చెబుతుంటే.. కేవలం 5 వేల ఉద్యోగాలతోనే నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులను వంచించడమేనని హరీశ్ రావు విమర్శించారు. తక్షణమే మొత్తం 19 వేల ఖాళీల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం..
కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తే, అందులో 2 వేల పోస్టులు హైదరాబాద్ పరిధిలోకే వెళ్లిపోతాయని.. మిగిలిన పోస్టుల్లో గ్రామీణ ప్రాంతాలకు, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో కులానికి ఒక్క పోస్టు కూడా దక్కదని, దీనివల్ల గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వాన్ని హరీశ్ రావు హెచ్చరించారు.
ఈ రెండున్నర సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది యువత వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిన ఏజ్ లిమిట్ ను వెంటనే రద్దు చేసి, బీఆర్ఎస్ హయాంలో ఉన్నట్లుగానే కానిస్టేబుల్ కు 36 ఏళ్లు, ఎస్సైకి 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఈవెంట్స్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడం పట్ల హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు ఈవెంట్లలో మూడింటికి అర్హత సాధిస్తే సరిపోయేదని, కానీ ఇప్పుడు లాంగ్ జంప్, షాట్ పుట్ లలో దూరం పెంచి మూడింటికి మూడు క్వాలిఫై కావాలనడం అన్యాయమన్నారు. వెంటనే పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
వేలాది మంది అభ్యర్థులు సన్నద్ధమవుతున్నా..
ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ అప్లికేషన్లకు ఫీజు ఉండదని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వేల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే తక్షణం అప్లికేషన్ ఫీజు లేకుండా స్వీకరించాలని డిమాండ్ చేశారు. దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో వేలాది మంది అభ్యర్థులు సన్నద్ధమవుతున్నా ఈవెంట్స్ ప్రాక్టీస్ కోసం సరైన గ్రౌండ్స్ లేవని, వారికి ప్రతిరోజూ కొంత సమయం పాటు సమీపంలోని పోలీసు లేదా ఇతర గ్రౌండ్స్ కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, 19 వేల పోస్టులతోపాటు మేనిఫెస్టోలో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సాధించేదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీశ్ రావు నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారు.
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసింది.
రాష్ట్రంలో 19 వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా @TelanganaDGP చెబుతుండగా,… pic.twitter.com/ixKjxaUoEJ
— Harish Rao Thanneeru (@BRSHarish) June 11, 2026
Read Also :
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

