సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : హర్డ్‌వేర్ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీవర్క్స్‌లో(T- Works) హర్డ్‌వేర్ మీటప్ను(Hardware Meetup) నిర్వహించారు. 40కి పైగా ఔత్సా హికులు పాల్గొని తమ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన నమూనాలను ప్రదర్శించారు. భౌతిక ఉత్పత్తుల నమూనాల తయారీ కేంద్రంగా ఉన్న టీ వర్స్ను ఔత్సాహికులను అందుబాటులో ఉంచి, వారి ఆలోచనలకు భౌతిక రూపం ఇచ్చిన ఆవిష్కరణలు చేసేందుకు హర్డ్‌వేర్ మీటప్ కార్యక్రమం దోహదం చేస్తుందని టీ వర్క్స్ నిర్వాహకులు తెలిపారు.